Warangal: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి!

Warangal: హన్మకొండ ఐడీఓసీలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా భూముల రీ-సర్వే కోసం లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

MD. AMEER, WARANGAL EAST
Published on: 17 Sept 2026 10:42 PM IST
Warangal
X

Warangal: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి!

వరంగల్: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హన్మకొండ ఐడీఓసీలో వరంగల్ జిల్లా సర్వే మరియు రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో రీ సర్వే లో భాగంగా లైసెన్డ్ సర్వేయర్లకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు కిట్లను అందజేశారు.

భూముల రీ-సర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన పరికరాలతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. భూముల కొలతలు, సర్వే పనులను నాణ్యతతో చేపట్టి రైతులకు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్ , ఎడి సర్వే మరియు రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST