Jangaon: జనగామలో ఘనంగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు!

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో రూ. కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేసి, నూతన ఆటోలను ప్రారంభించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 Sept 2026 1:08 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో ఘనంగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు!

Jangaon: జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ఆరంభించారు.

ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీకి చెందిన రూ. కోటి 77 లక్షల విలువ గల 16 చెత్త సేకరణ నూతన ఆటోలకు, జేసీబీకి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో శానిటరీ వర్కర్లు (30) మంది, డ్రైవర్ లు (20), ఎలక్ట్రీషియన్ లు (4)తో కలిపి మొత్తం (54) మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.

అనంతరం రూ. రెండు కోట్ల విలువ గల మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్ అండ్ మెషినరీ పనులు, అలాగే రూ. 38 కోట్ల విలువ గల మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ) పనులు, జిల్లాలోని తరిగొప్పుల మండలంలో రూ. 2.25 కోట్ల విలువ గల తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులు, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ ZPHS, MPPS పాఠశాలల్లో రూ.38.75 లక్షల వ్యయంతో భవన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు, అలాగే పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.24 లక్షలతో, రామచంద్రాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.23 లక్షలతో, జిల్లాకేంద్రంలోని కోర్టు వద్ద గల జెడ్పీ ఉన్నత పాఠశాల (బాలికలు) రూ. 20 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, అలాగే జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎం శ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) లలో రూ. 1,92,31,996 కోట్లతో అవుట్‌ డోర్ బాస్కెట్‌ బాల్ కోర్టుల నిర్మాణ పనులు, రూ. 19.25 లక్షల విలువ గల జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ. 7.35 లక్షల విలువ గల జనగామ చంపక్ హిల్స్‌లోని మాతా-శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్)లో ఆక్సిజన్ ప్లాంట్‌కు 50 మీటర్ల సీసీ రోడ్డు పనులు, పార్కింగ్ ప్రాంతంలో గ్రావెల్ నింపడం, సెప్టిక్ ట్యాంక్ నుంచి డ్రెయిన్ వరకు పైప్ డ్రెయిన్ (యూజీడీ) ఏర్పాటు, రూ. పది లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ కార్యాలయం) వద్ద పార్కింగ్ టైల్స్ వేయడం, ఫెన్సింగ్ ఏర్పాటు, రూ. 31 లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ భవనం)కు ప్రహరీ గోడ నిర్మాణాల పనుల శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించి, శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమంలో జనగామ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON