Mahabubabad: గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి తరలివచ్చిన నేతలు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 13 May 2026 5:58 PM IST
Mahabubabad
X

Mahabubabad: గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి తరలివచ్చిన నేతలు

మహబూబాబాద్: గ్రంధాలాయాలు సమాజ వికాసనికి వ్యక్తిగత జ్ఞాన అభివృద్ధికి పాటుపడే విజ్ఞాన గనులని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడుతూ....గ్రంధాలాయాలకు వెళ్లి పుస్తకం చదవడం వల్ల మంచి జ్ఞానాన్ని పొందవాచ్చన్నారు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి యువకులకు చదువుకోవడానికి అవసరమైన అన్ని రకాల పుస్తకాలు ఉండే వేదిక గ్రంధాలాయాలని, ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంచుకోని ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ ఐక్యంగా ఉండి వెనుకబడిన జిల్లాను అభివృద్ది చేసుకుందామన్నారు.

ఈ కార్యక్రమంలోఎం.పి బలరాం నాయక్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్,ఎమ్మెల్యే డాక్టర్. మురళీ నాయక్, మున్సిపల్ చైర్మన్ జ్యోతి , కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి ,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లు గంటా సంజీవ రెడ్డి , సుధాకర్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story