Mulugu: కోయగూడెంలో పీపుల్స్ చిల్డ్రన్ పాఠశాల ప్రారంభించిన మంత్రి సీతక్క!

Mulugu: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కోయగూడెంలో పీపుల్స్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన నూతన పాఠశాలను మంత్రి సీతక్క ఘనంగా ప్రారంభించారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 2 Sept 2026 10:07 PM IST
Mulugu
X

Mulugu: కోయగూడెంలో పీపుల్స్ చిల్డ్రన్ పాఠశాల ప్రారంభించిన మంత్రి సీతక్క!

ములుగు జిల్లా: గోవిందరావుపేట మండలం కోయగూడెంలో పీపుల్స్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ వారు ఏర్పాటు చేసిన పాఠశాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంబించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్ధుల కోసం పీపుల్స్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్న సేవలను మంత్రి సీతక్క గారు అభినందించారు వారు పాఠశాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేసి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story