Mulugu: ములుగు నూతన కలెక్టరేట్ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క!

Mulugu: ములుగు జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క రాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 5 Aug 2026 7:57 AM IST
Mulugu
X

Mulugu: ములుగు నూతన కలెక్టరేట్ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క!

Mulugu: నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించిన..

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

నూతనంగా నిర్మాణంలో ఉన్న ములుగు జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంగళవారం రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నిర్మాణ పనుల పురోగతి, వివిధ విభాగాల పనుల స్థితిగతులను పరిశీలించిన మంత్రి, ఇంకా మిగిలి ఉన్న పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీర్లు, కాంట్రాక్టర్‌ను పలు సూచనలు చేశారు.

భవన నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు.

అనంతరం పైలాన్ నిర్మాణ పనులను మంత్రి అనసూయ సీతక్క పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, మిగిలిన పనులను వేగంగా, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story