Mangapet: రాజుపేట స్కూల్లో సైన్స్ ల్యాబ్ ప్రారంభం.. గిరిజన హాస్టల్లో మంత్రి సీతక్క భోజనం!

Mangapet: మంగపేట రాజుపేట జడ్పీహెచ్ఎస్ స్కూల్లో సైన్స్ ల్యాబ్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. గిరిజన బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

I NARESH, ETURUNAGARAM
Published on: 25 Jun 2026 5:26 PM IST
Mangapet
X

Mangapet: రాజుపేట స్కూల్లో సైన్స్ ల్యాబ్ ప్రారంభం.. గిరిజన హాస్టల్లో మంత్రి సీతక్క భోజనం!

మంగపేట: మంగపేట మండలం రాజుపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవనం సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క.. విద్యార్థులకు నాణ్యమైన వసతి, భోజనం, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి..

ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతి, భోజనం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఏటా సంభవించే వరదల కారణంగా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని వెల్లడి.

ప్రజల భద్రత, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపూర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్‌తో కలిసి సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి.

పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హాస్టల్‌కు నూతనంగా చేరిన విద్యార్థినుల పరిస్థితులను పరిశీలించి, వసతి గృహంలోని మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించిన మంత్రి.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM

Next Story