Mulugu: రేపు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన!

Mulugu: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క విస్తృత పర్యటన: జగ్గన్నపేటలో అభివృద్ధి పనుల ప్రారంభం, అంగన్‌వాడీల్లో ‘తొలిముద్ద’ పథకం, కలెక్టరేట్ వద్ద నిరసనలో పాల్గొననున్న మంత్రి.

PONNALA SWAMY, MULUGU
Published on: 27 Sept 2026 11:31 PM IST
Mulugu
X

Mulugu: రేపు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన!

ములుగు: రేపు ములుగు జిల్లాలో పలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో గౌరవ రాష్ట్ర మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఉదయం 9:00 గంటలకు, జగ్గన్నపేట గ్రామం, మంత్రి గారి స్వగ్రామమైన జగ్గన్నపేటలో VO నూతన భవనం ప్రారంభోత్సవం. అనంతరం మంత్రి సీతక్క చేతుల మీదుగా సోలార్ పవర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం. ఆ తర్వాత మహిళలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేస్తారు.

ఉదయం 10:30 గంటలకు, మదనపల్లి. మదనపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో మంత్రి సీతక్క గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఉదయం 11:00 గంటలకు, నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం (IDOC) ప్రాంగణం, ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

మధ్యాహ్నం 12:00 గంటలకు, నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం (IDOC) అంగన్వాడీ కేంద్రాల్లో “తొలిముద్ద (టిఫిన్)” కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ములుగు జిల్లాలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU