Eturnagaram: ఐటీడీఏ పరిధిలో ప్రగతి పనులపై మంత్రి సీతక్క కీలక సమీక్ష!

Eturnagaram: ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ములుగు జిల్లా కలెక్టర్, పీవోతో కలిసి మూడు ఏజెన్సీ మండలాల అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి సీతక్క.

Narender, Staff Reporter  -Warangal
Published on: 16 July 2026 5:07 PM IST
Eturnagaram
X

Eturnagaram: ఐటీడీఏ పరిధిలో ప్రగతి పనులపై మంత్రి సీతక్క కీలక సమీక్ష!

Eturnagaram: గురువారం ఏటూరు నాగారం ఐటిడిఏ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో లతో కలిసి కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరు నాగారం మూడు ఏజెన్సీ మండలాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో డి.ఎఫ్.ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ, ఎం. సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story