Jangaon: నా ఓటు నా హక్కు - SIR ప్రక్రియపై మైనారిటీ సంఘాల అఖిలపక్ష భేటీ

Jangaon: జనగామలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నా ఓటు నా హక్కు - SIR 2026 సదస్సు జరిగింది.

MD AHMAD PASHA, JANGAON
Published on: 30 July 2026 10:47 PM IST
Jangaon
X

Jangaon: నా ఓటు నా హక్కు - SIR ప్రక్రియపై మైనారిటీ సంఘాల అఖిలపక్ష భేటీ

జనగామ: జనగామ జిల్లా ఆవాజ్ కమిటీ కన్వీనర్ మహ్మద్ అజహరుద్దీన్ అధ్యక్షతన నా ఓటు నా హక్కు SIR-2026 (Special Intensive Revision) అంశాలపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ ముస్లిం మైనారిటీ రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించడం ఓటరు జాబితాల సవరణ ప్రాముఖ్యతను తెలియజేయడం అలాగే SIR-2026 ప్రక్రియపై ప్రజలను చైతన్యవంతులను చేయడం ముసాయిదా లో తిరస్కరించబడిన ఓట్లను తిరిగి పునరుద్ధరించడం తదితర ఓటు చైతన్య విషయాలను ఈ పలువురు నేతలు మాట్లాడారు ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అని అర్హత కలిగిన ప్రతి పౌరుడు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ నా ఓటు నా హక్కు అనేది కేవలం నినాదం మాత్రమే కాదని ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు ఓటరు జాబితాలో పేరు లేకపోయినా వివరాల్లో తప్పులు ఉన్నా వెంటనే ఎన్నికల అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని అర్హుడైన ఏ ఓటరు కూడా తన ప్రాథమిక హక్కును కోల్పోకూడదని ఆయన కోరారు.

సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు సామాజిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఓటరు అవగాహన కార్యక్రమాలను ప్రతి గ్రామం కాలనీ బస్తీ వరకు విస్తరించాలని ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు విలువను గుర్తించి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సమావేశం ముగింపులో జనగామ జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించి SIR-2026 ప్రక్రియలో అర్హత కలిగిన పౌరుడి ఓటు నమోదు పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ మైనారిటీ చైర్మన్ మహ్మద్ మాజిద్ అఫ్సర్ బీఆర్‌ఎస్ నాయకుడు మహ్మద్ అబ్దుల్ సమద్ కాంగ్రెస్ జనగామ టౌన్ కార్యదర్శి ఖాదర్ షరీఫ్ టీఎస్ మీసా జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకూష్‌వలి మహ్మద్ తహసీన్ మహ్మద్ ఖలీల్ అహ్మద్ మహ్మద్ ఖదీర్ ఎండి ఫరీద్ ఉద్దీన్ అజ్మల్ తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story