Dharmasagar: క్యాతంపల్లి ఆలయాభివృద్ధికి కృషి రోడ్డు మంజూరు కడియం శ్రీహరి
Dharmasagar: క్యాతంపల్లి దేవస్థాన వనమహోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మొక్కలు నాటారు. స్వామివారిని దర్శించుకుని, ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Dharmasagar: క్యాతంపల్లి ఆలయాభివృద్ధికి కృషి రోడ్డు మంజూరు కడియం శ్రీహరి
Dharmasagar: ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామ పరిధిలోని శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే గారికి స్వామి వారి ఆశీర్వచనలు అందజేశారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రత్యేక విశిష్టత కలిగిన ఆలయం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 86రకాల సర్ప దోషాలకు నివారణ పూజలు ఈ ఒక్క శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోనే జరుగుతాయాన్ని అన్నారు.
ఇంత గోప్ప విశిష్టత కలిగిన ఆలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సంబందించి ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని వెల్లడించారు.
శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేశవనగర్ నుండి శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీదుగా పెద్దపెండ్యాల వరకు త్వరలోనే రోడ్డు మంజూరు చేయిస్తానని తెలిపారు.
శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, తహసీల్దార్, ఎంపిడివో, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




