Ghanpur: ఇకపై ఇంటి వద్దకే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Ghanpur: లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
Ghanpur: ఇకపై ఇంటి వద్దకే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఘనపూర్: లింగాల ఘనపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కళ్యాణ లక్ష్మి -షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సందర్బంగా లింగాల ఘనపూర్ మండలానికి సంబందించిన 51మంది కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ లబ్ధిదారులకు 51లక్షల 05వేల 916రూపాయల విలువగల చెక్కులను మరియు 18మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 6లక్షల 84వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు.
ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు పని చేయాలని అన్నారు. కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న రెండు నెలలో చెక్కులు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని త్వరితగతిన తల్లిదండ్రులు అందించేందుకు గ్రామాలలో పెళ్లి జరిగిన నెల రోజులలోపు దరఖాస్తు చేసుకునే విధంగా సర్పంచ్ లు చొరవ తీసుకోవాలని సూచించారు.
కల్యాణ లక్ష్మి పథకం విప్లవాత్మక పథకం అని కొనియాడారు. ఆడపిల్ల తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లక్షా 116రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గతంలో ఉన్న పాలకులు పనులు, పథకాలు, పదవులు అమ్ముకొని చిల్లర పనులతో నియోజకవర్గ పరువు తీసారని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి తావు లేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేద ప్రజల ఇంటికి చేర్చే బాధ్యత నాదని అన్నారు..




