Narsampet: పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కడియం శ్రీహరి పరామర్శ!
Narsampet: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాళులర్పించారు. నల్లబెల్లిలోని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Narsampet: పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కడియం శ్రీహరి పరామర్శ!
నర్సంపేట:
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి....
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్‌ఎస్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు గుర్తు చేసుకున్నారు. ఇంత చిన్న వయసులోనే తమ్ముడు లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. పెద్ది లేని లోటు పుడ్చలేనిదని ఇలాంటి కష్టసమయంలోనే మనోధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు ప్రొఫెసర్ కోదండరాం గారు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




