Warangal: పలివెల్పులలో నూతన గృహ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే!

Warangal: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పలివెల్పుల ఓఆర్ఆర్ వద్ద ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ రైతురాజు నూతన గృహ నిర్మాణ భూమి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 12:31 PM IST
Warangal
X

Warangal: పలివెల్పులలో నూతన గృహ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే!

Warangal: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రైతురాజు 1వ డివిజన్ పలివెల్పుల ఓఆర్ఆర్ వద్ద నిర్మిస్తున్న నూతన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన గృహ నిర్మాణానికి శుభారంభం పలికారు.

అనంతరం రైతురాజు గారు, వారి సతీమణికి నూతన గృహ నిర్మాణం విజయవంతంగా పూర్తయి, సుఖసంతోషాలతో వారి కుటుంబం కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మెట్టుగుట్ట దేవస్థానం చైర్మెన్ పైడిపాల రఘు చందర్, హసన్పర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేష్ రెడ్డి, మండల అధ్యక్షులు అశోక్, మాజీ కార్పొరేటర్ జానీ శిబారాణి అనిల్, మాజీ పాక్స్ చైర్మన్ బుద్దే పెద్దన్న, సీనియర్ నాయకు బైరీ లింగమూర్తి, బిజిలి సంపత్, గాదె రాము,ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్