Palakurthi: బురద పాయలోకి దిగిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

Palakurthi: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మాధాపురంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సందడి చేశారు

S MAHENDER, PALAKURTHI
Published on: 2 July 2026 6:09 PM IST
Palakurthi
X

Palakurthi: బురద పాయలోకి దిగిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

పాలకుర్తి: నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఓ సాధారణ రైతు కూలీగా మారారు.

వరి నాట్లు వేస్తూ మహిళా కూలీలతో శృతి కలిపి పాటలు పాడారు.గురువారం ఉదయం దేవరుప్పుల మండలం,మాధాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరై తిరిగి పాలకుర్తి క్యాంపు కార్యాలయానికి వెళ్ళే ప్రయాణంలో ఇలా వరిపొలం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే యశస్విని ఓ సాధారణ రైతు కూలీగా మారారు.మహిళా కూలీలతో కలివిడిగా కలిసిపోయారు.

కూలీలు,రైతులతో కలిసి బురదలోకి దిగి సరదాగా పాటలు పాడుతూ నాట్లు వేశారు.కూలీలతో కలిసి పాటను జతకట్టి సందడి చేశారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story