Mahabubabad: ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వకుంటే ఓటు కట్ ఎమ్మెల్యే హెచ్చరిక!
Mahabubabad: అయోధ్య, ముడుపుగల్ గ్రామాలలో ఎమ్మెల్యే మురళీ నాయక్ ఓటర్ల ప్రత్యేక సవరణ (SSR) ప్రక్రియను తనిఖీ చేసి, ఆగస్టు 3 లోగా పత్రాలు ఇవ్వాలని కోరారు.
Mahabubabad: ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వకుంటే ఓటు కట్ ఎమ్మెల్యే హెచ్చరిక!
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మురళీ నాయక్ స్వయంగా పరిశీలించారు. ఆగస్టు 3వ తేదీలోపు ఎన్యూమరేషన్ పత్రాలను తప్పనిసరిగా నింపి బీఎల్‌ఓలకు అందజేయాలని, లేదంటే ఓటర్ల జాబితాలో పేర్లు ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
మహబూబాబాద్ జిల్లా అయోధ్య, ముడుపుగల్ గ్రామాల్లో నిర్వహించే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఎన్యూమరేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే మురళీ నాయక్ పరిశీలించారు. బీఎల్‌ఓలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల తో మాట్లాడారు. ఎన్యూమరేషన్ పత్రాలను స్వయంగా నింపుతూ ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.
18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. అలాగే, ఆగస్టు 3వ తేదీలోపు ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు. గడువులోగా పత్రాలు సమర్పించకపోతే ఓటర్ల జాబితాలో పేర్లు ఉండకపోవచ్చని హెచ్చరించారు.
ఓటర్ల జాబితా నుంచి ఒక్కరూ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఎల్‌ఓలను ఆదేశించిన ఎమ్మెల్యే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.




