Guduru: మాటనిలబెట్టుకున్న ఎమ్మెల్యే మురళీ నాయక్...

Guduru: గూడూరు మండలం దొరవారి తిమ్మాపూర్ ఆదివాసీ గ్రామంలో ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే మురళీ నాయక్ పర్యటన.

B NARASIMHA, GUDUR
Published on: 28 May 2026 7:12 PM IST
Guduru
X

Guduru: మాటనిలబెట్టుకున్న ఎమ్మెల్యే మురళీ నాయక్...

గూడూరు: కాకులు దూరనీ కారడవి..బైక్ లు తప్ప వేరే వాహనాలు వెళ్లని ఆదివాసిల గ్రామం అయిన గూడూరు మండలం దొరవారి తిమ్మాపూర్ గ్రామంలో.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ గ్రామం లో విద్యుత్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే మురళి నాయక్. మళ్ళీ గ్రామ ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు ద్విచక్ర వాహనం పై వెళ్ళి అందరిని ఆశ్చర్యపరచారు. ఇల్లిల్లు తిరుగుతూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

పలు సమస్యలు గ్రామస్తులు తెలపడం తో వెంటనే స్పందించి రోడ్డు ,చెక్ డ్యాం,బోరుబావి మరమ్మత్తు లకు హామీ ఇచ్చారు.ఈ గ్రామం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాననీ తెలిపారు. ఎమ్మెల్యే స్పందించిన తీరు, సమస్యల పరిష్కారం కు చూపిన చొరవ కు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా రూ.4కోట్ల వ్యయం తో గ్రామ సమస్యలు త్వరలో తీరుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

రికార్డు బ్రేక్ చేసిన ఎమ్మెల్యే..

ఇప్పటి వరకు గెలిచిన తర్వాత వచ్చిన ఏకైక ఎమ్మెల్యే గా మురళీ నాయక్ రికార్డు బ్రేక్ చేశారు. గతం లో పలువురు ఎన్నికల ముందు వచ్చి మాయ మాటలు చెప్పి వెళ్ళారని, ఎన్నికల తర్వాత ,గెలిచినప్పటికీ ఒక్కరు కూడా ఇప్పటి వరకు రాలేదన్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రచారం లో భాగంగా వచ్చి, అప్పుడు ఇచ్చిన హామీ లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story