Hanamkonda: హనుమకొండలో పరుగులు తీసిన యువత.. 5కే రన్‌లో సందడి చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే!
Hanamkonda: హనుమకొండ జేఎన్ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాల్లో భాగంగా 5కే మారథాన్ రన్ నిర్వహించారు.
Hanamkonda: హనుమకొండలో పరుగులు తీసిన యువత.. 5కే రన్‌లో సందడి చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే!
Hanamkonda: యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం 5కే మారథాన్ రన్‌ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి.
99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన, క్రీడల వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఉదయం నిర్వహించిన 5కే మారథాన్ రన్‌ను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహాత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ శ్రీ ఇనగాల వెంకట్రామిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
హనుమకొండ జేఎన్ స్టేడియం నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఈ మారథాన్‌లో యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం, జట్టు భావన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నర్సింహ రావు డివైఎస్‌వో ప్రశాంత్, డీపీఆర్‌వో ఆయూబ్ అలీ, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు.




