Warangal: విద్యానికేతన్ పాఠశాలలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం!

Warangal: పశ్చిమ నియోజకవర్గం 7వ డివిజన్‌లో మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 25 Aug 2026 9:02 PM IST
Warangal
X

Warangal: విద్యానికేతన్ పాఠశాలలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం!

వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్‌లో హంటర్ రోడ్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యానికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైనవని, అందులోనూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు కోరారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యులకు, నిర్వాహకులకు, 7వ డివిజన్ ప్రజాప్రతినిధులు, నాయకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు,యువజన నాయకులు తోట పవన్,డివిజన్ అధ్యక్షులు పోలు లక్ష్మి నారాయణ, నాయకులు,డాక్టర్లు తదితరులు ఉన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story