Warangal: వరంగల్ ఆఫీసర్స్ క్లబ్‌లో కొత్త పనులు.. ప్రారంభించిన ఎమ్మెల్యే

Warangal: వరంగల్ ఆఫీసర్స్ క్లబ్‌లో చేపట్టనున్న పలు నూతన అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భూమిపూజ/ప్రారంభోత్సవం చేశారు.

AJAY, HANMAKONDA
Published on: 5 Jun 2026 5:30 PM IST
Warangal
X

Warangal: వరంగల్ ఆఫీసర్స్ క్లబ్‌లో కొత్త పనులు.. ప్రారంభించిన ఎమ్మెల్యే

వరంగల్: వరంగల్ ఆఫీసర్స్ క్లబ్‌లో చేపట్టనున్న పలు నూతన అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, ఆఫీసర్స్ క్లబ్‌ను మరింత ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి సభ్యులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్లబ్ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

క్లబ్ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం సభ్యులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story