Parkal: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి!

Parkal: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. సీఎం సభకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారని, తనపై విమర్శలు చేసేవారికి ప్రజల ఆశీర్వాదమే సమాధానమని స్పష్టం చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 22 Aug 2026 5:34 PM IST
Parkal
X

Parkal: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి!

పరకాల: పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. పరకాలలో జరిగిన ముఖ్యమంత్రి సభకు కాంగ్రెస్ కార్యకర్తలు పిలిస్తే సభకు 80 శాతం వచ్చారని మిగతా 20% వాహనాల ద్వారా తీసుకురావడం జరిగింది.

కానీ బలవంతంగా సభకు మాత్రం తీసుకురాలేదు. ప్రజల ఆశీర్వాదం అభిమానంతో వారు నాపై ఉంచిన నమ్మకం నేను చేసే అభివృద్ధిని ఓర్వలేక కొందరు అదే పనిగా ముసలోడు, కట్టే పట్టుకొని నడుస్తున్నానని అనడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఏదో కాకి పిల్లో మేక పిల్లో ఇష్టం వచ్చినట్టు అంటున్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలివేస్తున్నానని అన్నారు.

సభలో వచ్చిన అభిమాన జన సమూహాన్ని చూసి, ముఖ్యమంత్రి సభలో పరకాల ఎమ్మెల్యే సీటు మరోసారి ప్రకటించాడని అన్నారు. రెండున్నర సంవత్సరాల పైన నేను చేస్తున్న అభివృద్ధికి మీరు ఇచ్చిన ఆశీర్వాదం అది అన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story