Hanamkonda: పరకాల ఏరియా ఆసుపత్రికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సాయం!
Hanamkonda: హనుమకొండ జిల్లా పరకాల ఏరియా హాస్పిటల్కు రోగులు, సహాయకుల సౌకర్యార్థం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 10 కుర్చీలను అందజేశారు.
Hanamkonda: పరకాల ఏరియా ఆసుపత్రికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సాయం!
Hanamkonda: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి మరో మంచి అడుగు వేశారు. పరకాల ఏరియా హాస్పిటల్కు 10 కుర్చీలను బహూకరించారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, ప్రజలకు ఉపయోగపడేలా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తన వంతుగా చిన్న సహకారంగా ఈ కుర్చీలను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు చందుపట్ల రాఘవరెడ్డి, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్ కుమార్, 20వ వార్డు కౌన్సిలర్ పాలకుర్తి శ్రీనివాస్ మరియు డాక్టర్లు ఆర్.ఎం.ఓ బాలకృష్ణ, డాక్టర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




