Parkal: పరకాల భవాని ఆలయంలో అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే!

Parkal: పరకాల శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 10 Nov 2026 1:07 PM IST
Parkal
X

Parkal: పరకాల భవాని ఆలయంలో అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే!

Parkal: పరకాల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదని, ఈ మాసంలో చేసే అన్నదానానికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులను ఆదేశించారు.

అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL