Hanamkonda: నడికూడలో PHC, మహిళా సమైక్య భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే!
Hanamkonda: హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన PHC మరియు మహిళా సమైక్య భవనాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.
Hanamkonda: నడికూడలో PHC, మహిళా సమైక్య భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే!
Hanamkonda: నడికూడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవనం మరియు మహిళా సమైక్య భవనాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నడికూడ మండల పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ నూతన PHC భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య, సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.
అనంతరం నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాలను కూడా పరిశీలించారు. మహిళా సంఘాల సాధికారతకు ఈ భవనాలు దోహదపడతాయని తెలిపారు.




