Hanumakonda: ఆత్మకూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి!

Hanumakonda: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి. అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ.

M PRABHAKAR, PARAKAL
Published on: 6 Sept 2026 2:22 PM IST
Hanumakonda
X

Hanumakonda: ఆత్మకూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి!

Hanumakonda: ఆత్మకూరు మండలం లింగమడుగు పల్లి, కామారం,గుడెప్పాడ్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి, సందర్భంగా లబ్ధిదారులకు శాలువాతో సన్మానించి, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని,పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని,ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story