Jangaon: రైతులకు 7 రకాల విత్తన సంచులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని

Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 23 Jun 2026 3:11 PM IST
Jangaon
X

Jangaon: రైతులకు 7 రకాల విత్తన సంచులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని

Jangaon: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విత్తన మేళా కార్యక్రమాన్ని పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న 7 రకాల ధృవీకరించిన (సర్టిఫైడ్) విత్తనాల సంచులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల వినియోగంతో రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని, వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

అనంతరం రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు,రైతులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story