Palakurthi: గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని

Palakurthi: పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో దేవరుప్పుల మండల గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల అందజేత. పాల్గొన్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.

S MAHENDER, PALAKURTHI
Published on: 3 July 2026 2:05 PM IST
Palakurthi
X

Palakurthi: గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని

పాలకుర్తి: తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల(గౌడ సోదరులు)రక్షణ కోసం ఉద్దేశించిన 'కాటమయ్య రక్ష'కిట్లను వివిధ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు.

అందులో భాగంగానే పాలకుర్తి మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దేవరుప్పుల మండల గీత కార్మికులకు 'కాటమయ్య రక్ష' కిట్లను దేవరుప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ సమక్షంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కారు పోతుల యాదయ్య,లబ్ధిదారులు కారుపోతుల పాపయ్య,రాములు,రాజు,మహేష్,సతీష్,మహేందర్,దర్గయ్య,ఆకుల వెంకటయ్య,లక్ష్మయ్య,బబ్బూరి కిష్టయ్య,మహేందర్,తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story