Kuravi: కురవిలో ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్న గుగులోతు రవినాయక్!
Kuravi: మహబూబాబాద్ జిల్లా కురవి తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు గుగులోతు రవినాయక్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకుని, పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
Kuravi: కురవిలో ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్న గుగులోతు రవినాయక్!
Kuravi: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలంగాణ ఉద్యమ నాయకుడు గుగులోతు రవినాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం కురవి మండల తహసీల్దార్ కార్యాలయంలో పట్టభద్రులతో కలిసి ఫారం–18 ద్వారా తన ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకుని ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
2023 నవంబర్‌కు ముందు డిగ్రీ, సంబంధిత డిప్లొమా లేదా ఓపెన్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గుగులోతు వెంకటేష్, బానోత్ వాసు తదితర పట్టభద్రులు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు.




