Mahabubabad: వనరులు, యాస, భాషలను కాపాడుకోవాలి.. ఎమ్మెల్సీ కోదండరామ్

Mahabubabad: మహబూబాబాద్‌లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 21 Jun 2026 8:32 PM IST
Mahabubabad
X

Mahabubabad: వనరులు, యాస, భాషలను కాపాడుకోవాలి.. ఎమ్మెల్సీ కోదండరామ్

Mahabubabad: ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ వనరులను, యాశ, బాసల కాపాడుకోవాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఆర్తీ గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ జిల్లా సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేయడంతో ఉద్యమకారుల్లో చైతన్యo వచ్చిందని, పాత జేఏసీలు , కళాకారులు సమావేశం అవుతున్నారని, కమిటీలు వేస్తే జాప్యం కాదని, కమిటీకి అందరూ సహకరించాలని కోరారు.

బయటి నుంచి ఎవరు వచ్చినా అభ్యంతరం లేదని , ఇక్కడికి వచ్చిన వారిని గౌరవిస్తామని ,తెలంగాణ సంస్కృతి గంగా... జమున... తహసీబ్ వంటిదని గుర్తు చేశారు. కృష్ణా లో వాటా తీసుకురావాలని, గోదావరిలో వాటా తేల్చాలని , పోతిరెడ్డి పాడు తూములను వెడల్పు చేయాలని, పోతిరెడ్డిపాడు నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నాన్ని ఎదిరించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ లో ప్రాంతీయ విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఆత్మీయ సదస్సు లో తెలంగాణ ఉద్యమకారులు , కళాకారులు ,అభిమానులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story