Mulugu: చిన్నారుల సర్వాంగీణ అభివృద్ధికి అంగన్‌వాడీలే వేదిక
Mulugu: ములుగు జిల్లా శ్రీరాములపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో 'ప్రథమ్' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'స్కూల్ రెడీనెస్ మేళా' ఘనంగా జరిగింది.
Mulugu: చిన్నారుల సర్వాంగీణ అభివృద్ధికి అంగన్‌వాడీలే వేదిక
Mulugu: చిన్నారులలో అన్నిరకాల అభివృద్ధి జరగాలంటే అంగన్వాడి పాఠశాలలకు పంపాలని ములుగు ప్రాజెక్టు సి.డి.పి.ఓ శిరీష మంగళవారం కొడిశెలకుంట సెక్టార్ లోని శ్రీరాములపల్లి అంగన్వాడి పాఠశాలలో ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్కూల్ రెడీనెస్ మేళా కార్యక్రమంలో పాల్గొని తెలిపారు.
పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మంచి పౌష్టిక ఆహారం కూడా అంగన్వాడి సెంటర్ లో అందుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలో పిల్లలకు బట్టీ సిస్టమ్ ద్వారా చదువు నేర్పిస్తున్నారని, అంగన్వాడీలలో ఆటపాటల ద్వారా చదువు, కథలు నేర్పిస్తారని తెలిపారు.
గ్రామంలోని తల్లిదండ్రులందరు చిన్నారులను అంగన్వాడి బడికి పంపాలని, మన బడిని మనమే కాపాడుకోవాలని గ్రామ సర్పంచ్ రాజేందర్ తెలిపారు. అంగన్వాడి బడికి 3 నుండి 5 సంవత్సరాల పిల్లలను పంపిస్తే అన్నీ రకాలుగా అభివృద్ధి చెందుతారని తెలిపారు.
పిల్లలను అంగన్వాడి టీచర్ తల్లి లాగ చూసుకుంటుందని, అన్నిరకాల మంచి అలవాట్లు, ఆట పాటలు నేర్పిస్తుందని గ్రామ ఉపసర్పంచ్ తిరుపతి తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన సెక్టార్ సూపర్ వైజర్ సరస్వతి మాట్లాడుతూ చిన్నారులకు ఆటలు పాటలు, కథలు, మంచి అలవాట్లు టీచర్ నేర్పిస్తుందన్నారు.
విద్యార్థులలో శారీరక, భాషా బుద్ధి వికాస మేధోభివృద్ధి, మరియు పూర్వగణిత వికాసానికి చెందిన అభివృద్ధి అంగన్వాడి పాఠశాలలకు వచ్చిన వారిలో ఎక్కువగా జరుగుతాయని, వారు తెలివిగల వారుగా తయారవుతారని ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ మాస్టర్ ట్రైనర్ నాగేశ్వర్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, సి.డి.పి.ఓ, సూపర్ వైజర్, మదర్స్, అంగన్వాడి టీచర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




