Mulugu: కలెక్టరేట్ ఉద్యోగి ప్రభుత్వ భూమి కబ్జా
Mulugu: ములుగులో కలెక్టరేట్ ఉద్యోగి ప్రభుత్వ భూమి కబ్జా. సర్వే నంబర్ 266లో పట్టా చూపించి 267/1లో షెడ్ల నిర్మాణం. కబ్జా భూమిని స్వాధీనం చేసుకుంటామన్న తహశీల్దార్.
Mulugu: కలెక్టరేట్ ఉద్యోగి ప్రభుత్వ భూమి కబ్జా
ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి శివారులోని ప్రభుత్వ భూమి267/1 సర్వే నెంబర్ లో ములుగు కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ఏకంగా మూడు ఫ్లాట్లను కబ్జా చేసి ప్రహరీ నిర్మించి అధికారులను తప్పుదోవ పట్టించి ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 266 సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ చేసుకొని 267/1లో పొజిషన్లో ఉండడంతో భూకబ్జాల బాగోతం బయట పడింది.
భూకబ్జాలపై ములుగు తహసిల్దార్ ని వివరాలు అడగడంతో 267/1 సర్వే నెంబర్ లో షెడ్లు వేసుకొని ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు,మున్సిపాలిటీ అధికారులను రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి ఇంటి నెంబర్ల తో కట్టిన ఇండ్ల ను స్థలాలను స్వాధీనం చేసుకుంటామ న్నారు.ములుగు తాహశీల్దార్ విజయభాస్కర్.




