Mulugu: రామన్నగూడెం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక!

Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట పుష్కర ఘాట్ల వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది.

I NARESH, ETURUNAGARAM
Published on: 31 July 2026 10:12 AM IST
Mulugu
X

Mulugu: రామన్నగూడెం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక!

Mulugu: ములుగు జిల్లా ఏటూర్ నాగారం, మంగపేట పుష్కర్ ఘాట్ల వద్ద గోదావరి వేగంగా పెరుగుతూ వస్తుంది, ఎగువన ఉన్న మేడిగడ్డ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల నుండి 12 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో గంట గంటకు గోదావరి వేగం పెరుగుతూ వస్తుంది,

రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 16.2 మీటర్లకు చేరుకుంది, ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది, 17.32 మీటర్ల కు నీటిమట్టం చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద 59 గేట్లు ఎత్తి వరద దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు,

సమ్మక్క సాగర్ బ్యారేజి కి ప్రస్తుతం 11 లక్షల 86 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 11 లక్షల 84 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు,

గంట గంటకు గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM

Next Story