Mulugu: SIIMA అవార్డు అందుకున్న ములుగు జిల్లా గేయ రచయిత పూర్ణాచారి!

Mulugu: ములుగు జిల్లా బండారుపల్లి గేయ రచయిత చల్లూరి పూర్ణాచారి 'కోర్టు' చిత్రంలోని పాటకి బెంగళూరులో SIIMA ఉత్తమ గేయ రచయిత అవార్డు అందుకున్నారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 14 Sept 2026 3:43 PM IST
Mulugu
X

Mulugu: SIIMA అవార్డు అందుకున్న ములుగు జిల్లా గేయ రచయిత పూర్ణాచారి!

Mulugu: ములుగు జిల్లా బండారు పల్లి గ్రామానికి చెందిన చల్లూరి పూర్ణచారి కి ఉత్తమ గేయ రచయిత పురస్కారం. కోర్టు చిత్రంలోని" కథలెన్నో చెప్పారు" అనే పాటకు బెంగళూరులో సైమా అవార్డు అందుకున్న పూర్ణ చారి.

ఈ నెల 12,13వ తేదీలలో బెంగళూరులో జరిగిన అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఉత్తమ గేయ రచయిత పురస్కారం అందుకున్నారు మార్చి 14న విడుదలైన కోర్టు సినిమాల్లో రాసిన కథలెన్నో చెప్పారు... కవితల్ని రాశారు అనే పాట.... కూ

ఆన్లైన్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా పూర్ణాచారికి అధిక ఓట్లు రావడంతో... పురస్కారాన్ని అందజేశారు ములుగు జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని బండరు పల్లి గ్రామానికి చెందిన చల్లూరి రాజమౌళి - లక్ష్మి దంపతుల కుమారుడు పూర్ణాచారి పదవ తరగతి వరకు ములుగు లోనే ప్రైవేట్ పాఠశాలలో చదువుకొని హనుమకొండలో ఇంటర్మీడియట్ చదివిన అనంతరం కాకతీయ యూనివర్సిటీలో బీఫార్మసీ పూర్తి చేశారు.

కోర్టు సినిమాలోని" కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు" పాటకు ఆన్లైన్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా పూర్ణచారి కి అధిక ఓట్లు రావడంతో బెంగళూరులో నిర్వాహకులు సైమా అవార్డు అందించారు.ఇప్పటివరకు 600 పైగా పాటలు రాశారు,

ప్రేమమ్ చిత్రంలో అగరోత్తుల కురులే అనే పాట సినీ రంగంలో ఆయన రాసిన మొదటిది.పూర్ణ చారికి అవార్డు దక్కడంతో చిన్ననాటి స్నేహితులతో పాటు గ్రామస్తులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU