Mulugu: ములుగు వర్షాభావం రైతులకు మంత్రి సీతక్క సూచనలు
Mulugu: ములుగులో మంత్రి సీతక్క స్పందన. వర్షాభావ పరిస్థితుల్లో పంట మార్పిడి, నీటి సంరక్షణపై అవగాహన. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా "జల సిరి" కార్యక్రమం.
Mulugu: ములుగు వర్షాభావం రైతులకు మంత్రి సీతక్క సూచనలు
ములుగు: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవడం లేదని, ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు.
అధిక నీటి అవసరం ఉన్న పంటల కంటే తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని, చెరువులు, కుంటలు, డ్యామ్ పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాధారిత పంటల సాగుపై జాగ్రత్త వహించాలని సూచించారు.
రాష్ట్ర మంత్రి సీతక్క ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయని, తాగునీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా "జల సిరి" కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా "ఇంటికొక ఇంకుడు గుంత – ఊరికొక ఊట కుంట – ప్రతి పంటకు పంట కుంట" లక్ష్యంగా నీటి సంరక్షణ పనులు చేపడతామన్నారు మంత్రి సీతక్క
జల సిరి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, ప్రజలు భాగస్వాములై నీటి వనరుల సంరక్షణకు సహకరించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నీటి నిల్వలను పెంచడం ద్వారానే భవిష్యత్‌లో తాగునీటి, సాగునీటి సమస్యలనుఅధిగమించగలమని మంత్రి సూచించారు




