Mulugu: పీవీఎన్ఆర్ ఓపెన్‌కాస్ట్‌పై కీలక నివేదిక.. కలెక్టర్‌తో సింగరేణి భేటీ!

Mulugu: పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ శాస్త్రీయ అధ్యయన వివరాలను ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు వివరించిన సింగరేణి ఉన్నతాధికారులు.

PONNALA SWAMY, MULUGU
Published on: 7 Sept 2026 7:05 PM IST
Mulugu
X

Mulugu: పీవీఎన్ఆర్ ఓపెన్‌కాస్ట్‌పై కీలక నివేదిక.. కలెక్టర్‌తో సింగరేణి భేటీ!

ములుగు జిల్లా: పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ప్రాంతంలో నిర్వహించిన వివిధ శాస్త్రీయ అధ్యయనాల ఫలితాలను సింగరేణి కాలరీస్ సంస్థ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు వివరించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును సింగరేణి అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఓపెన్‌కాస్ట్ ప్రాంతంలో నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనాల్లో వెల్లడైన అంశాలు, వాటి ఆధారంగా చేపట్టాల్సిన చర్యలు, పర్యావరణ పరిరక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు.

ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) వెంకటేశ్వర్లు, భూపాలపల్లి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ జనరల్ మేనేజర్ జి. దేవేందర్, ఎన్విరాన్‌మెంట్ జనరల్ మేనేజర్ పి. సిద్దులు, ఎక్స్‌ప్లోరేషన్ జనరల్ మేనేజర్ పంకజ్ కులశ్రేష్ఠతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story