Mulugu: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం చేయాలి!

Mulugu: హైదరాబాద్ నుండి కలెక్టర్లతో సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు హాజరు.

PONNALA SWAMY, MULUGU
Published on: 29 Aug 2026 8:01 PM IST
Mulugu
X

Mulugu: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం చేయాలి!

Mulugu: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.

శనివారం హైదరాబాద్ నుండి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈ.ఆర్.ఓ లతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నోటీసుల జారీ, పరిష్కార చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆర్డీఓ కృష్ణవేణి తో కలిసి ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలని, ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్దిష్ట గడువులో విచారణ చేపట్టాలని, సంబంధిత రికార్డుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. నోటీసుల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అన్ని నోటీసులను సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా అందజేయాలని, నోటీసులు అందజేసిన రోజు నుండి 7 రోజుల గడువు పూర్తయిన అనంతరం విచారణ నిర్వహించాలని సూచించారు.

అనామలీస్/నో మ్యాపింగ్ జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉంచాలని, సంబంధిత వ్యక్తులు క్లెయిమ్స్, అభ్యంతరాల సందర్భంగా సమర్పించాల్సిన పత్రాలు, ఆధారాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రస్తుత స్థితిని రోజువారీ ప్రాతిపదికన నోటీస్ బోర్డుపై నవీకరించాలని, ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ, నిర్దేశిత గడువులో పనులను పూర్తి చేయాలని తెలిపారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను సజావుగా నిర్వహించాలని తెలిపారు. ప్రక్రియ కొరకు నియమించిన ఎ.ఈ.ఆర్.ఓ. లకు అవసరమైన శిక్షణ అందించాలని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో అనామోలీస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు సంబంధించి 41900

నోటీసుల జనరేట్ చేయబడి10909 నోటీసులు జారీ చేసి యాప్ లో వివరాలు నవీకరించడం జరిగిందని తెలిపారు. 448 నోటీసుల హియరింగ్ ప్రక్రియ పూర్తి చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియ నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ ఎం. నితీష్ తదితరులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story