Jangaon: జనగామ: గణనాథుడి పూజల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి
Jangaon: జనగామ బాలాజీ నగర్‌లో వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజ, అన్నదానంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి పాల్గొన్నారు.
Jangaon: జనగామ: గణనాథుడి పూజల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి
జనగామ జిల్లా: పట్టణంలోని బాలాజీ నగర్ లో వినాయక మిత్ర బృందం ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుడి వద్ద ఘనంగా కుంకుమ పూజ,అన్నదాన కార్యక్రమం...పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్.
జనగామ పట్టణంలోని బాలాజీ నగర్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా 7వ రోజు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీ మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు సమర్పించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, శ్రీనివాస్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ వేడుకల్లో కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




