Jangaon: పరిశుభ్రమైన జనగామ కోసం ప్రతి శుక్రవారం డ్రై డే పాటించండి
Jangaon: జనగామ మున్సిపాలిటీ పరిధిలో డ్రై డే – ఫ్రైడే కార్యక్రమం. డెంగ్యూ, మలేరియా నివారణకు ప్రతీ ఇంటా నీటి నిల్వలు లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి.
Jangaon: పరిశుభ్రమైన జనగామ కోసం ప్రతి శుక్రవారం డ్రై డే పాటించండి
జనగామ: తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ (MA&UD) శాఖ ఆదేశాల మేరకు జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఇంటి యజమాని వ్యాపార సంస్థలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తమ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి పూర్తిగా ఖాళీ చేసి శుభ్రపరచాలని కూలర్లు, ట్యాంకులు టైర్లు కొబ్బరి చిప్పలు, పూల కుండీలు వంటి ప్రదేశాల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మున్సిపల్ సిబ్బంది వార్డు వారీగా డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జనగామ నిర్మాణానికి సహకరించాలని కమిషనర్ కోరారు.




