Bayyaram: బయ్యారంలో ముత్యాలమ్మ తల్లి పండుగ వేడుకలు!
Bayyaram: మహబూబాబాద్ బయ్యారం మండలంలో ముత్యాలమ్మ తల్లి పండుగ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, ప్రజాప్రతినిధులు.
Bayyaram: బయ్యారంలో ముత్యాలమ్మ తల్లి పండుగ వేడుకలు!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో సర్పంచ్ శాంతి కిషన్ నాయక్, జగ్గు తండా సర్పంచ్ జయంతి వెంకటకృష్ణ ముత్యాలమ్మ తల్లి పండుగ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆనవాయితీగా జరుపుకుంటారు అన్నారు, ముత్యాలమ్మ తల్లి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలు అమ్మవారికి పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించి ముక్కులు తీర్చుకుంటారు , మండలంలో ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ముత్యాలమ్మ తల్లి.ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
పండుగ సందర్భంగా గ్రామంలోని ప్రజలు ఊరు, వాడ తేడా లేకుండా ఏకమై తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ప్రత్యేక అలంకరణలో గుడి చుట్టూ చుట్టూ ప్రభలను తిప్పుతూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.
తల్లిని దర్శనం కోసం భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రజలు కోరిన కోరికలు తీర్చే గ్రామ దేవతగా ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.
పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.




