Warangal: చిన్నారుల కంటిచూపుపై మయోపియా పంజా: డాక్టర్ రవిశంకర్!

Warangal: మొబైల్ ఫోన్ల అధిక వాడకంతో పిల్లల్లో మయోపియా పెరుగుతోందని వరంగల్ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ శంభునిపేట పాఠశాల శిబిరంలో తెలిపారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 23 Nov 2026 6:45 PM IST
Warangal
X

Warangal: చిన్నారుల కంటిచూపుపై మయోపియా పంజా: డాక్టర్ రవిశంకర్!

వరంగల్: ప్రస్తుత డిజిటల్ యుగంలో పాఠశాల విద్యార్థులు మొబైల్ ఫోన్ అధిక వాడకం వల్ల మయోపియా కు గురవుతున్నారని, వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ అన్నారు.

జాతీయ మయోపియా అవగాహన సప్తాహం సందర్భంగా శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటుచేసి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.. శిబిరం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల వినియోగం పెరగడం, ఆరుబయట ఆటలకు సమయం తగ్గడం, ఎక్కువసేపు దగ్గరి పనులు చేయడం తదితర కారణాలవల్ల పిల్లలలో మయోపియా రోజురోజుకు పెరుగుతున్నదని అన్నారు.. విద్యార్థుల రోజు వారి కార్యకలాపాలతో పాటు చదువుపై, ఏకాగ్రతపై ప్రభావం చూపే ఈ మయోపియాను నిర్లక్ష్యం చేస్తే కంటి పవర్ పెరిగి రెటీనా, గ్లాకోమా లాంటి తీవ్ర కంటి సమస్యలు వస్తాయని అన్నారు.

వైద్య పరీక్షల అనంతరం కంటి ఆరోగ్యం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను.. కంటి ఆసుపత్రి వైద్యులు ప్రొఫెసర్ శ్రీకుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు..

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజూ కనీసం రెండు గంటలపాటు ఆరుబయట గడిపేలా ప్రోత్సహించడం, స్క్రీన్ సమయాన్ని నియంత్రించడం, సరైన వెలుతురులో చదివేలా చూడటం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు..

ఈ కార్యక్రమంలో ఖిలా వరంగల్ MEO వెంకటయ్య, ప్రధానోపాధ్యాయులు రఫీక్ అహ్మద్, ధర్మపురి రాజగోవిందు, కడుదుల, రాధాకృష్ణ, దేవులపల్లి శ్రీనాథ్, ఉపాధ్యాయులు, కంటి వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST