Mulugu: మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి

Mulugu: మామునూరు విమానాశ్రయానికి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని తెలంగాణ గౌడ సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 20 Sept 2026 4:48 PM IST
Mulugu
X

Mulugu: మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి

ములుగు జిల్లా: మామునూరు విమానాశ్రయానికి బహుజన వీరుడు, గౌడ జాతి ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని తెలంగాణ గౌడ సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు తోటకూరి శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్న నేపథ్యంలో,చారిత్రక ప్రాధాన్యత కలిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును విమానాశ్రయానికి పెట్టి ఆయనకు తగిన గౌరవం కల్పించాలని కోరారు.

సామాజిక సమానత్వం,బహుజనుల ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు.వరంగల్ ప్రాంతంతో పాపన్న గౌడ్‌కు ఉన్న చారిత్రక అనుబంధాన్ని గుర్తిస్తూ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం సముచితమని పేర్కొన్నారు.

ఈ నిర్ణయం ద్వారా ఆయన పోరాట స్ఫూర్తి, వీరగాథ భవిష్యత్ తరాలకు చేరుతాయని అన్నారు.గౌడలు,బహుజనులు,ఉత్తర తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తోటకూరి శ్రీకాంత్ గౌడ్ కోరారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU