Narsampet: కాలువలో పడిన వృద్ధురాలిని కాపాడిన బ్లూ కోల్ట్ అధికారి!
Narsampet: నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కాలువలో పడి ఉన్న వృద్ధురాలిని రక్షించిన బ్లూ కోల్ట్ అధికారి రమేష్. ఆసుపత్రిలో చికిత్స, వివరాల కోసం పోలీసుల గాలింపు.
Narsampet: కాలువలో పడిన వృద్ధురాలిని కాపాడిన బ్లూ కోల్ట్ అధికారి!
Narsampet: నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కాలువలో పడి ఉన్న ఒక గుర్తు తెలియని వృద్ధురాలిని బ్లూ కోల్ట్ అధికారి రమేష్ అప్రమత్తంగా గమనించి వెంటనే రక్షించారు.
వృద్ధురాలిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
వృద్ధురాలి వివరాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా స్పందించి వృద్ధురాలి ప్రాణాలను కాపాడిన బ్లూ కోల్ట్ అధికారి రమేష్ ను స్థానికులు అభినందించారు.
Next Story




