Narsampet: నర్సంపేటలో దారుణం.. అక్రమ సంబంధం నేపథ్యంలో వివాహిత హత్య!
Narsampet: నర్సంపేట వివాహిత హత్య కేసులో కీలక పురోగతి. అక్రమ సంబంధం నేపథ్యంలో పాండవుల సురేష్ అనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
Narsampet: నర్సంపేటలో దారుణం.. అక్రమ సంబంధం నేపథ్యంలో వివాహిత హత్య!
Narsampet: నర్సంపేట పరిధిలో వివాహిత హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి కీలక పురోగతి సాధించారు. పాండవుల సురేష్‌పై అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్య కేసు నమోదు కాగా, కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆధారాల ఆధారంగా అతడిని నిందితుడిగా గుర్తించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, ముఖ్యంగా కాల్ డేటా రికార్డులు (CDR) పరిశీలించి పాండవుల సురేష్ పాత్రను ధ్రువీకరించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతురాలు సుమలత భర్త ఐదు సంవత్సరాల క్రితం మరణించాడు. అనంతరం ఆమె మరో వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందనే అంశంపై ఇరువురి మధ్య తరచూ వాగ్వాదాలు జరిగినట్లు సమాచారం. ఈ వివాదాలే హత్యకు దారితీసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.




