Narsampet: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసానే ఇందిరమ్మ బీమా లక్ష్యం
Narsampet: నర్సంపేట మండలం రామారంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద; మార్గదర్శకాల వెల్లడి.
Narsampet: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసానే ఇందిరమ్మ బీమా లక్ష్యం
నర్సంపేట: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట మండలం రామారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగిందన్నారు.
కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తికి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా జీవిత బీమా ద్వారా భద్రత కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నర్సంపేట జిల్లాలో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు కేంద్రాలను ప్రారంభించి లబ్ధిదారుల దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరిగిందని,
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, అర్హులైన కుటుంబాలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ వార్డులో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
*అర్హులైన ప్రతి కుటుంబం నుంచి ఒక సంపాదించే వ్యక్తిని గుర్తించి నమోదు చేయాలన్నారు*
*18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులు గా గుర్తించాలన్నారు*
*నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి*
*ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను సరిచూసుకోవాలి
*నామినీ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి
*వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందించాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో డిపివో కల్పన , జడ్పీ సీఈవో వసంత ఆర్డీవో ఉమారాణి , ఎంపీడీవో శ్రీనివాస్ ,స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




