Narsampet: నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు
Narsampet: నర్సంపేట పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థినులు సీఐ ముష్క శ్రీనివాస్, పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి వేడుకలు జరుపుకున్నారు.
Narsampet: నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు
నర్సంపేట: రాఖీ పౌర్ణమి సందర్భంగా నర్సంపేట పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ని శివాని పాఠశాల విద్యార్థినులు సందడి చేశారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న విద్యార్థినులు సిఐ ముష్క శ్రీనివాస్ పాటు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థినులు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం ఆనందంగా ఉందని సీఐ తెలిపారు.
విద్యార్థినులు మాట్లాడుతూ సమాజ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గిరగాని రాహుల్ వర్మ, ఉపాధ్యాయిని లు ప్రియాంకా, నందిని, దివ్య పోలీసు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.




