Narsimhulapet: గ్యామ తండాలో ఘనంగా తీజ్ వేడుకలు

Narsimhulapet: నర్సింహులపేట మండలంలోని గ్యామ తండాలో వైభవంగా గిరిజనుల తీజ్ వేడుకలు. ప్రారంభించిన డోర్నకల్ ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ ప్రమీల.

P PRABHAKAR, DORNAKAL
Published on: 23 Aug 2026 11:25 PM IST
Narsimhulapet
X

Narsimhulapet: గ్యామ తండాలో ఘనంగా తీజ్ వేడుకలు

నర్సింహులపేట: నర్సింహులపేట మండలంలోని గ్యామ తండా గ్రామపంచాయతీలో ఆదివారం తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్, గారి సతీమణి డాక్టర్ ప్రమీల పాల్గొని తీజ్ వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహిళలు, యువత సంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొని తీజ్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. సంప్రదాయ పాటలు, నృత్యాలతో తండాలో పండుగ వాతావరణం నెలకొంది. తీజ్ పండుగ గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి, సమన్వయ కమిటీ చైర్మన్ దాస్రు నాయక్, మాజీ మండల అధ్యక్షుడు జినకల రమేష్, పడమటి గూడెం సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య, ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ చిర్ర సతీష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తీజ్ వేడుకలు ప్రజల మధ్య సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తూ గిరిజన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేలా కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్యామ తండా గ్రామపంచాయతీ ప్రజలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story