Mahabubabad: రైతులకు ఉచిత పవర్ స్ప్రేయర్ల పంపిణీ!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఎస్‌ఆర్ నిధులతో 1500 మంది రైతులకు ఉచితంగా పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్‌లను పంపిణీ చేశారు.
Mahabubabad: రైతులకు ఉచిత పవర్ స్ప్రేయర్ల పంపిణీ!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో రైతుల సంక్షేమానికి పెద్ద ఎత్తున చేయూత అందించే కార్యక్రమం నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఎస్‌ఆర్ నిధులతో 1500 మంది రైతులకు ఉచితంగా పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్ నాయక్ పాల్గొని రైతులకు సామగ్రిని అందజేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్ నాయక్ 1500 మంది రైతులకు ఉచితంగా పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్‌లను పంపిణీ చేశారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా ఈ సహాయాన్ని అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
రైతు దేశానికి వెన్నుముక అని, అన్నదాత సంక్షేమం కోసం పనిచేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని హుస్సేన్ నాయక్ అన్నారు. రైతులు, మహిళలు, యువత అభివృద్ధికి మరింతగా సహకరిస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, మహిళల సాధికారత కోసం శిక్షణ కార్యక్రమాలు, కుట్టుమిషన్ల పంపిణీ చేపట్టి స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. అలాగే సబ్సిడీ రుణాలు పొందేందుకు కూడా సహకారం అందిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.




