Sangem: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నాయక్ పార్టీ అభ్యర్థులు: సాంబయ్య!

Sangem: తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో నాయక్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని వ్యవస్థాపకుడు సాంబయ్య నాయక్ గురువారం తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Nov 2026 7:10 PM IST
Sangem
X

Sangem: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నాయక్ పార్టీ అభ్యర్థులు: సాంబయ్య!

వరంగల్ జిల్లా, సంగెం: లంబాడి, అరే, ఎరుకల భాషల పరంగా నాయక్ పార్టీ ఏర్పడిందని నాయక్ పార్టీ వ్యవస్థాపకులు ధారవాత్ సాంబయ్య నాయక్ అన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, అలాగే మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో నాయక్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని సాంబయ్య నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నాయక్ పార్టీ అభ్యర్థులకు విద్యావేత్తలు, ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ అందరూ తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సాంబయ్య నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సాంబయ్య నాయక్, జనరల్ సెక్రటరీ రమేష్, ఉప అధ్యక్షులు శివకోటి, స్వప్న, సెక్రెటరీస్ కల్పన, సుధాకర్, తర్య, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్