Hanamkonda: హన్మకొండ జిల్లాలో ప్రారంభమైన ‘నీట్’ పరీక్ష..
Hanamkonda: హన్మకొండ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు నీట్ యూజీ (NEET UG 2026) పరీక్ష ప్రారంభమైంది.
Hanamkonda: హన్మకొండ జిల్లాలో ప్రారంభమైన ‘నీట్’ పరీక్ష..
హన్మకొండ: దేశ వ్యాప్తంగా వైద్య విద్య ఏంబీబీఎస్ , బీడీఎస్ లో ప్రవేశాలకోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష NEET UG 2026కు NTA ఏర్పాట్లు చేసింది.
ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో 6,149 మంది పరీక్ష రాయనున్నారు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నాం 1:30 గంటల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. దివ్యంగులకు ఒక గంట సమయం అదనంగా ఉంటుంది.
గతంలో 2 నుండి 5 గంటల వరకు నిర్వహించగా ఈ సారి పరీక్షా సమయాన్ని 15 నిమిషాలు పెంచారు. ప్రతీ పరీక్షా కేంద్రం లో CCTV కెమెరాలు జామర్లు బిగించారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story




