Maripeda: మరిపెడలో నూతన రేషన్ కార్డుల పంపిణీ: విప్ రామచంద్ర నాయక్

Maripeda: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో 11, 13 వార్డుల లబ్ధిదారులకు డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 9 Nov 2026 1:31 PM IST
Maripeda
X

Maripeda: మరిపెడలో నూతన రేషన్ కార్డుల పంపిణీ: విప్ రామచంద్ర నాయక్

మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 13వ, 11వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రవి నాయక్, మాజీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీర్ రెడ్డి, మరిపెడ తహసీల్దార్, ఎంపీడీవో, మండల నాయకులు, ఆయా వార్డుల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL