Jangaon: నిడిగొండ.. శిథిలమవుతున్న చారిత్రక సంపద

Jangaon: జనగామ జిల్లా నిడిగొండ గ్రామంలోని నతవాడి రాజుల కాలం నాటి త్రికూటాలయం, అద్భుతమైన శిల్పకళా విశేషాలు మరియు చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ.. ఈ కట్టడాలను పునరుద్ధరించాలని గ్రామస్తుల విన్నపం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 12 May 2026 9:04 PM IST
Jangaon
X

Jangaon: నిడిగొండ.. శిథిలమవుతున్న చారిత్రక సంపద

Jangaon: నిడిగొండ గ్రామం సహజమైన అందాలతో అలరించే చక్కని పల్లెటూరు.ఈగ్రామంలోని చెరువులు, కుంటలు, వాగు వంకలు, గుట్టలు, పాడి పంటలతో విలసిల్లుతూ రమణీయ ప్రకృతితో మనలని స్వాగతించి ఆనందాన్ని నింపుతుంది. ప్రకృతి పరిమళాలు మాత్రమే కాదు చారిత్రక కట్టడాలకు, ఆద్యాత్మిక కాంతులకి ఈ గ్రామం అపూరూపమైన గ్రామం. ఆదిమమానవుల నుండి నేటి వరకు తన విశేషాలను చూపిస్తూ పలకరిస్తుంది ఈపల్లె.

శాతవాహనులు, రాష్ట్రకూటూలు,కళ్యాణి చాళుక్యులు,కాకతీయులు, నతవాడి సామాంత రాజుల పాలనతో వెలిగిన గ్రామం ఈనిడిగొండ. కాకతీయులను అనుసరిస్తూ వారికి సామంతులుగా, వారితో వివాహ సంబంధాలను ఏర్పరచుకోని ఘనమైన సామంత రాజ్యంగా బాసిల్లిన నతవాడి రాజుల నివాస స్థానమై వారసత్వ కాంతులను వెదజల్లుతున్నది. శిథిలమై పునరుద్ధరణకై వేచి చూస్తున్న త్రికూటాలయంలోని కాలముఖ శైవ గురువులు, సప్తతాళ భంజనం, వాలివధ, తారావిలాపం, వాహనాలతో ఉన్న అష్టదిక్పాలకులు,

ఉమామహేశ్వరులు, నంది, హనుమంతుడు, సూర్యుడి అధిష్టాన పీఠం, నాట్యగత్తేలు, వాయిధ్యకారులు,సైనికులు, యాళి శిల్పాలు,జాలకాలు,విష్ణు,శివద్వారపాలకులు, గజదార,సింహ దార,లతలతో ,రమణీయమైన అలంకరాలతో చెక్కిన శిల్పాలు ఇలా ఎన్నేన్నో విశేషమైన శిల్పాలను తన ఒడిలో భద్రపరచి భావితరాలకి ఆనాటి సంస్కృతిని అందిస్తున్నాయి. ఎంతో చారిత్రాత్మక విశిష్టత కలిగిన ఈ గ్రామం శిథిలావస్థలోకి చేరుకుంటున్న కట్టడాలను తిరిగి ప్రభుత్వం పూర్వ వైభవాన్ని చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story